Home టెక్నాలజీ చిక్కుల్లో ఫేస్ బుక్ ? మెటా పై దావా ?

చిక్కుల్లో ఫేస్ బుక్ ? మెటా పై దావా ?

829

[vc_row][vc_column]

[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]పేస్ బుక్ మాతృసంస్థ అయినటువంటి మెటా పై ఆస్ట్రేలియా బిలీనియర్ మరియు వ్యాపారవేత్త అయినటువంటి ఫోర్టెస్క్యూ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆండ్రూ ఫారెస్ట్ అమెరికన్ కోర్టులో వేసిన దావాను ఇటీవల కోర్టు విచారించింది.

అసలేం జరిగిందంటే ఫేస్బుక్ లో వ్యక్తిగత మరియు వ్యాపార ప్రకటనలను ఎవరైనా చేయవచ్చని అందరికి తెలిసిందే , అయితే దీనిని కొంతమదని దుర్వినియోగపరచి ప్రజలను మోసం చేసిన సందర్భాలు కోకొల్లలు , ఇలాంటి సంఘటన సామాన్య ప్రజలకే కాదు , సంపన్నులకు కూడా తప్పట్లేదు.

బిలియనీర్ ఆస్ట్రేలియన్ మైనింగ్ మాగ్నెట్ ఆండ్రూ ఫారెస్ట్ నకిలీ క్రిప్టోకరెన్సీ పేరుమీద గతంలో పేస్ బుక్ లో క్రిప్టో కరెన్సీ మరియు కొన్ని ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చని కొన్ని నకిలీ ప్రకటనలు ప్రచురింపబడ్డాయని దీని వల్ల కేవలం సామాన్యులు తమ డబ్బును కోల్పోవడమే కాకుండా తన వ్యక్తిగత పరువును కూడా కోల్పోయానని అంతే కాకుండా ప్రకటనల ద్వారా భారీమొత్తము లో పేస్ బుక్ ఆదాయాన్ని ఆర్జించింది అని ఆండ్రూ ఫారెస్ట్ తరపు న్యాయవాది కోర్ట్ కి తెలియజేసారు.

ప్రకటనలు ఇచ్చేవారు వివరాలను పేస్ బుక్ పట్టించుకోకుండా కేవలం వాటి మీద ఆదాయం కోసమే పనిచేస్తుందని ఇది వ్యక్తుల ఆదాయ మరియు ఆర్థిక నష్టాన్ని కలిగించడమే అని తెలియజేసారు[/vc_column_text][/vc_column][/vc_row]