[vc_row][vc_column]
పుష్ప 1 కు కొనసాగింపుగా పుష్ప 2 కూడా రాబోతుంది , అయితే ఈ చిత్రాన్ని ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గం ఇప్పటికే ప్రకటించింది , కానీ ఇక్కడే అభిమానుల్లో చిన్న అనుమానం మొదలయింది అసలు నిజంగానే సినిమా ఆగష్టు 15 న విడుదల అవుతుందా లేక వాయిదా పడుతుందా అని .
దీనికి కారణం లేకపోలేదు , డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ , ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది , ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ రాబోతుంది.
తాజాగా ఈ సినిమా హీరో రామ్ పోతినేని X ( గతంలో ట్విట్టర్ ) లో డబల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆగష్టు 15 న విడుదల అవ్వబోతుంది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు , అంతే కాకుండా ఇదే వారం లో నాని నటించిన సరిపోదా శనివారం సినిమా కూడా విడుదల అవ్వబోతుంది అంటూ పరిశ్రమ లో ప్రచారం నడుస్తుంది.
ఒకవేళ నిజంగానే ఈ రెండు సినిమా లు ఆగష్టు 2 వ వారం లో విడుదల అయితే పుష్ప 2 మూవీ కచ్చితం గా లేనట్లే అని అనుకోవాల్సి వస్తుందేమో[/vc_column_text][/vc_column][/vc_row]