[vc_row][vc_column]
జులై 31 వ తారీకులోగా ఆదాయపరిమితి లోకి ప్రతిఒక్కరు ఐటీ రిటర్న్ ను దాఖలు చేయాలనీ , లేని పక్షంలో అపరాధ రుసుము చెల్లించి డిసెంబర్ 31 లో గా కూడా ఐటీ రిటర్న్ ను దాఖలు చేయవచ్చని తెలిపింది , ఎవరైతే జులై 31 లోగా రిటర్న్ దాఖలు చేయలేకపోతారో వారు కచ్చితంగా అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుందని తెలిపారు.
అంతే కాకుండా టాక్స్ రూపంలో అధికంగా చెల్లించి , చెల్లించిన అధిక మొత్తాన్ని రీఫండ్స్ రూపంలో పొందాలి అంటే వాలిడేట్ చేసిన బ్యాంకు అకౌంట్ ను మీ ఖాతాకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది , ఒకవేళ ఇప్పటికే బ్యాంకు అకౌంట్ ను వాలిడేట్ చేసినవారైనా సరే మరొక్కసారి మీ అకౌంట్ ను రీ వాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది .
అయితే ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు ఇతర బ్యాంకులతో అనుసంధానం చేయడం వలన మారినటువంటి బ్రాంచులు , ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వంటి వివరాలతో రీ వాలిడేట్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తెలిపింది[/vc_column_text][/vc_column][/vc_row]